విజయనగరం జిల్లాలో భారీగా పెరిగిన విద్యుత్తు వినియోగం

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ఎండలు, ఉక్కపోత తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం భారీగా హెచ్చింది. భూగర్భ జలాలు అడుగንటడంతో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు డిమాండ్ పెరిగింది. పవన, జలవిద్యుత్తు ఉత్పత్తి తగ్గడం కూడా దీనికి కారణమని అధికారులు తెలిపారు. డిమాండ్‌కు తగినట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు వెల్లడించారు.