డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల తీవ్ర అప్రమత్తత అవసరమని పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: అల్లూరి సీతారామరాజు
డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అల్లూరి జిల్లా పోలీసులు హెచ్చరించారు. పోలీసులమని లేదా అధికారులమని ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసే సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిజమైన పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్స్ లో అరెస్ట్ చేయరని స్పష్టం చేస్తూ, అటువంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.