నీట్ పరీక్ష నుంచి రెండేళ్ల పాటు శివరాజ్ మోతేగాంకర్ కుమారుడికి అనర్హత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: లాతూరు
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన లాతూరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ మోతేగాంకర్ కుమారుడు ఆదిత్య మోతేగాంకర్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది పరీక్ష ఫలితాలను నిలిపివేయడంతో పాటు, రెండేళ్ల పాటు నీట్ పరీక్ష రాయకుండా అనర్హత వేటు వేసింది. సీబీఐ దర్యాప్తులో వెల్లడైన నివేదిక ఆధారంగా ఎన్టీఏ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్ 19న స్పష్టం చేసింది.