టెక్కీ రిమోట్ జాబ్ కష్టాలు: లక్ష జీతం ఉన్నా గ్రామంలో తీవ్ర ఒంటరితనం
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
నెలవారీగా లక్ష రూపాయల జీతం వస్తున్నప్పటికీ, సొంతూరిలో రిమోట్ ఉద్యోగం చేయడం వల్ల తీవ్రమైన ఒంటరితనం ఎదురవుతోందని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి వినోద సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతంలో జీవించడం వల్ల రోజువారీ జీవితం బోరింగ్‌గా మారుతోందని, మెరుగైన జీవన శైలి కోసం వేరే ప్రాంతానికి మారాలో లేదో అర్థంకాక సతమతమవుతున్నానని సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నారు.