నల్లపరెడ్డిపల్లి రహదారి నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలని వినతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు
నల్లపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి గ్రామాలను కలిపే ప్రధాన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్ బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుని కలిసి వినతిపత్రం అందజేశారు. మూడు గ్రామాల ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను సమర్పిస్తూ, రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని ఆయన వివరించారు.