ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్-2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 51 శాతం, రెగ్యులర్ అభ్యర్థులు 47 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించని అభ్యర్థులు నిరుత్సాహపడకుండా వైఫల్యాలను అధిగమించి ముందుకు సాగాలని లోకేశ్ సూచించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు.