పట్టభద్రులంతా గడువులోగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలన్న తల్లోజు ఆచారి

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ ఆరో తేదీలోపు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా అర్హులైన పట్టభద్రులు ఓటరుగా పేర్లు నమోదు చేసుకుని రాబోయే ఎన్నికల్లో బాధ్యతగా తమ హక్కును వినియోగించుకోవాలని తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు.