ఉద్యోగులకు భారీ షాక్: పీఎఫ్ వేతన పరిమితి పెంపుతో తగ్గిన టేక్ హోమ్ జీతం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచడంతో ఈ నెల జీతాల్లో పీఎఫ్ కటింగ్ భారీగా పెరిగిందని నిపుణులు తెలిపారు. ఈ కొత్త నిబంధన అమల్లోకి రావడంతో ఉద్యోగుల వాటా 12 శాతం చొప్పున నెలకు అదనంగా రూ.1,200 పీఎఫ్లోకి వెళ్లనుందని, దీనివల్ల చేతికి వచ్చే వేతనం తగ్గుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ అదనపు మొత్తం భవిష్యత్ రిటైర్మెంట్ సేవింగ్స్గా జమ అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు.