ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి ఏడుపు చూసి నొచ్చిన థమన్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడంపై సంగీత దర్శకుడు థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేజ్‌పై వారు ఏడుస్తుంటే తనకు ఎందుకో నవ్వొచ్చిందని, స్టూడియోలో మామూలుగా ఉన్న వాళ్ళు ఈవెంట్‌కి వచ్చేసరికి అలా ఎందుకు ఏడ్చారో అర్థం కాలేదని థమన్ సరదాగా గుర్తు చేసుకున్నారు.