జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దుర్గం భూమయ్య ఎంపిక
రిపోర్టర్: Gone Rachana
స్థలం: దస్తురాబాద్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం మున్యాల్ జెడ్.పి.ఎస్.ఎస్. పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దుర్గం భూమయ్య జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వామన్ రావు ఈ విషయాన్ని తెలిపారు.
పాఠశాల విద్యాభివృద్ధికి, వినూత్న బోధనకు, పాఠశాల ప్రగతికి భూమయ్య చేసిన కృషికి ఈ అవార్డు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కట్కూరి లలితా రాజేష్, తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.