తుఫాను బాధితులకు అండగా టాలీవుడ్ దర్శకుడు శైలేష్ కొలను: స్వయంగా సహాయ పంపిణీ
రిపోర్టర్: సునీల్
స్థలం: కాకినాడ
ఆంధ్రప్రదేశ్ లో అర్నాబ్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన కాకినాడ ప్రాంత ప్రజలకు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను స్వయంగా సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులు, తాగునీరు అందించినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు వందలాది మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయక చర్యల్ లో భాగస్వామ్యమైనట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో దర్శకుడు చూపిన మానవత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.