మరణంలోనూ నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన డ్రైవర్
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడకు చెందిన ఆటో డ్రైవర్ రాజ్యా నాయక్ అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయన మరణం తర్వాత కుటుంబ సభ్యులు రాజ్యా నాయక్ రెండు కళ్లను హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులకు దానం చేశారు. ఈ నేత్రాలను చూపు లేని నిరుపేదలకు అమర్చనున్నట్లు వైద్యులు తెలిపారు.