ముంబైలోని చారిత్రాత్మక కేశవ్జీ నాయక్ చాల్లో గణేష్ ఉత్సవాల ప్రత్యేకత
రిపోర్టర్: హరి
స్థలం: Mumbai
ముంబైలోని గిర్గావ్లో ఉన్న చారిత్రాత్మక కేశవ్జీ నాయక్ చాల్లో పది రోజుల పాటు జరిగే గణపతి ఉత్సవాలు పందొమ్మిదవ శతాబ్దపు నాటి సంప్రదాయాలను గుర్తుకు తెస్తున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ పిలుపు మేరకు 1893లో ప్రారంభమైన ఈ సార్వజనిక గణేష్ ఉత్సవాల వేదిక నేటికీ అదే సరళమైన సంస్కృతిని, సాంప్రదాయ పద్ధతులను కొనసాగిస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.