కేరళలో విషాదం.. కన్నకూతురిని గొంతు కోసి చంపిన తల్లి

రిపోర్టర్: శివ స్థలం: కేరళ

కేరళలోని తిరువనంతపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహ వార్షికోత్సవం రోజే ఏడాదిన్నర వయసున్న కన్నకూతురిని కత్తితో గొంతు కోసి క్రిస్టీ అనే మహిళ దారుణంగా హత్య చేసింది. అనంతరం తాను కూడా అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.