గన్యా తండా భూముల పట్టాల సమస్య పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి
రిపోర్టర్: విజయ్
స్థలం: మెదక్
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గన్యా తండా గ్రామపంచాయతీకి సంబంధించిన 204 భూముల పట్టాల సమస్యపై గ్రామ ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిసి తమ సమస్యను వివరించారు. ఈ భూములకు పట్టాలు మంజూరు చేసి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇస్తూ త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.