జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ లో సంక్షోభం: పార్టీలో అంతర్గత కుమ్ములాటలంటూ రామ్ మాధవ్ వ్యాఖ్యలు

రిపోర్టర్: శివ స్థలం: శ్రీనగర్

జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తిందని బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ ఎంపీ ఆగా రుహుల్లా రాజీనామా చేయడం, భారీ నిరసన ప్రదర్శన నిర్వహించడం అధికార పార్టీలో విభేదాలను బట్టబయలు చేసిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిణామాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా వారి అంతర్గత విషయమని రామ్ మాధవ్ తేల్చిచెప్పారు.