రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్ గాంధీ బురదజల్లుతున్నారంటూ కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

సుప్రీంకోర్టు నుంచి ఈడీ, సీబీఐ వరకు ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం బురదజల్లుతున్నారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని తమ కుటుంబం మాత్రమే పాలించాలనే నియంతృత్వ, ఫ్యూడల్ భావజాలంతోనే ఆయన ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుట్రలను గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడటం తగదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.