వైకల్యంతో బాధపడుతున్న చిన్నారికి పెన్షన్ మంజూరు చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం గ్రామానికి చెందిన రామ్చరణ్, శిరీష దంపతుల ఆరేళ్ల కుమార్తె హన్విక 90 శాతం తీవ్ర వైకల్యంతో బాధపడుతోంది. కాళ్లు, చేతులు పనిచేయని చిన్నారికి సదరం సర్టిఫికెట్లో తాత్కాలిక వైకల్యం అని నమోదు కావడంతో పెన్షన్ రావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాపను చూసుకునేందుకు కూలి పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.