సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో అర్హులైన పేద కుటుంబాలకు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పారదర్శకంగా కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.