ప్రజల సమస్యల పరిష్కారమే జనవాణి ప్రధాన లక్ష్యం

రిపోర్టర్: sankar p స్థలం: సర్వేపల్లి

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సహకారం అందించారు.