దీపావళి వేళ ఆవు పేడతో దీపాలు: మహిళలకు ఉపాధి కల్పిస్తున్న యువకులు
రిపోర్టర్: సురేష్
స్థలం: రాంచీ
ఝార్ఖండ్ రాంచీకి చెందిన సోనాలి, రోషన్ అనే ఇద్దరు యువకులు దీపావళి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని గోవర్ క్రాఫ్ట్ పేరుతో వినూత్న స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆవు పేడ, మట్టి మిశ్రమంతో అందమైన దీపాలు, విగ్రహాలను తయారు చేస్తూ ఐదు వందలకు పైగా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటి నుంచే పని చేస్తూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, కుటుంబ అవసరాలతో పాటు పిల్లల చదువులకు ఈ ఉపాధి ఎంతగానో తోడ్పడుతోందని వారు పేర్కొన్నారు.