టీచర్లపై కక్ష కట్టారంటూ వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వైన్స్ షాపుల వద్ద కాపలా పెట్టి అవమానించారని, ఇప్పుడు గంజాయి బ్యాచ్‌ను పంపి ఉపాధ్యాయులపై దాడులు చేయిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. చదువు చెప్పే గురువులపై ఎందుకంత కక్ష అని ప్రశ్నిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిలదీతలు వెలువడ్డాయి. ఉపాధ్యాయ వర్గాలపై జరుగుతున్న వరుస పరిణామాలు, దాడులపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది.