స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి: సీఎం రేవంత్‌రెడ్డికి కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
జనగణనలో ఓబీసీల కులగణన చేపట్టడంతో పాటు ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసేలా తీర్మానం చేయడానికి రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం బహిరంగ లేఖ రాశారు. జనాభా దామాషా ప్రకారం ఫలాలు అందాలంటే చట్టపరమైన లెక్కలు ఉండాలని స్పష్టం చేశారు.