అణు దాడి ముప్పు వేళ ఇరాన్ పౌరులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ

రిపోర్టర్: గోపి స్థలం: టెహ్రాన్

అమెరికా భీకర దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం తమ పౌరులకు అణు దాడి నుంచి రక్షించుకునే మార్గాలపై ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రేడియో ధార్మికత నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలు మూసివేయాలని, ఏసీలు ఆపివేయాలని సూచించారు. అణు విస్ఫోటనం జరిగితే అనుసరించాల్సిన జాగ్రత్తలతో కూడిన వీడియోను విడుదల చేశామని అధికారులు వెల్లడించారు.