భార్యను సజీవ దహనం చేసిన భర్తకు మరణశిక్ష

రిపోర్టర్: నరేష్ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. 2018లో కిరోసిన్ పోసి భార్య షాజాదిని సజీవ దహనం చేసిన నదీమ్ అనే వ్యక్తికి స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఘటనను అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయస్థానం, నిందితుడికి ఉరిశిక్షతో పాటు రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.