మురసు తుపాను ప్రభావం: అల్లకల్లోలంగా మారిన బాపట్ల సముద్ర తీరం

రిపోర్టర్: రాజేష్ స్థలం: బాపట్ల

మురసు తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారిందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో భారీ అలలు ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో అధికార యంత్రాంగం సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంది.