ఎన్నికలు కాని యాభై ఎనిమిది గ్రామపంచాయతీలకు ముప్పై మూడు కోట్ల నిధులు విడుదల చేసిన మంత్రి సీతక్క
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కోర్టు కేసులు తదితర కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించని 58 గ్రామపంచాయతీల ప్రత్యేక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33.62 కోట్లను విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధసరి అనసూయ సీతక్క తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయినా, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే స్వయంగా ఈ నిధులను సమకూర్చినట్లు ఆమె స్పష్టం చేశారు.