సీబీఎస్ఈ మూల్యాంకన పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్‌లైన్ మూల్యాంకన విధానంలోని లోపాలను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారించినందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మార్కుల లెక్కింపులో లోపాలున్న విద్యార్థులు వ్యక్తిగతంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని న్యాయస్థానం వెల్లడించింది.