తీవ్ర అలర్ట్: తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ నాలుగో తేదీ వరకు వివిధ జిల్లాల్ లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. అకస్మాత్తుగా ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం హెచ్చరించింది.