అన్నవరంలో వాటర్ బాటిల్ అదనపు ధరకు రూ.7 లక్షల జరిమానా

రిపోర్టర్: గోపి స్థలం: కాకినాడ

అన్నవరం దేవస్థానంలో ఎమ్మార్పీ ధర కంటే రూ.7 అదనంగా వసూలు చేసిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.7 లక్షల భారీ జరిమానా విధించింది. సత్యగిరిపై వాటర్ బాటిల్ విక్రయంలో నిబంధనలు ఉల్లంఘించడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన కోర్టు, వినియోగదారుల సంక్షేమ నిధికి జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు బలమైన హెచ్చరికగా నిలిచింది.