ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని టోరెంట్ గ్రూప్ను కోరిన మంత్రి లోకేష్

రిపోర్టర్: విజయ్ స్థలం: అహ్మదాబాద్

ఆంధ్రప్రదేశ్లో ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. అహ్మదాబాద్లో టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతాతో ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో ఏపీఐల తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏపీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని టోరెంట్ అధినేత సానుకూలంగా స్పందించినట్లు మంత్రివర్గ వర్గాలు పేర్కొన్నాయి.