సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారీగా పెరిగిన వేతనం
రిపోర్టర్: శివ
స్థలం: సింగపూర్
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ వేతనం భారీగా పెరగనుంది. ఆయన వార్షిక పారితోషకం 3.6 మిలియన్ డాలర్లకు, అనగా భారత కరెన్సీలో సుమారు రూ. 26.9 కోట్లకు చేరనుంది. ఈ పెంపుతో ఆయన ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకునే ప్రభుత్వ అధినేతగా నిలవనున్నారు. అయితే ఈ అదనపు ఆదాయాన్ని తాను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు.