అనీష్ హీరోగా వెంకీ కుడుముల నిర్మాణంలో ఇట్లు అర్జున సినిమా టీజర్ విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

అనీష్, అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇట్లు అర్జున సినిమా టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల మొదటిసారి నిర్మాతగా మారుతుండగా, ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. హీరో పాత్రను మ్యూట్ క్యారెక్టర్‌గా డిజైన్ చేయడం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.