ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ సినిమా విడుదల వాయిదా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ విడుదల వాయిదా పడింది. డిసెంబరు 3న రావాల్సిన ఈ సినిమా కొంచెం వెనక్కి వెళ్లనుందని నిర్మాత వై.రవిశంకర్ హైదరాబాద్ లో జరిగిన ది ప్యారడైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్వయంగా ప్రకటించారు. ఇది వేరే లెవెల్ సినిమా అని, బాహుబలి తర్వాత ప్రభాస్ ను అంత గొప్పగా చూపే చిత్రమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.