'గిరిజనుల ఆత్మగౌరవానికి ఇచ్చిన గౌరవం': బీఆర్ఎస్ నాయకుడు రాపోల్ నవీన్ కుమార్
రిపోర్టర్: విజయ్
స్థలం: సూర్యాపేట
నేరేడుచర్ల మండలం పులగంబండ తండాలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతానికి పెంపు నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోల్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులను స్వయం పాలకులుగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, ఇది గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు.