ఏపీ పోలీసుల అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ సిద్ధం

రిపోర్టర్: సురేష్ స్థలం: గుంటూరు

మంగళగిరిలో ఏపీ పోలీసు శాఖ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 14 వేలకు పైగా సీసీ కెమెరాలను అనుసంధానించి, కృత్రిమ మేధతో రాష్ట్రవ్యాప్త భద్రతను పర్యవేక్షించనున్నారు. 'ఆల్వేస్ వాచింగ్.. ఆల్వేస్ రెడీ' నినాదంతో నేర నియంత్రణ, విపత్తుల నిర్వహణలో ఈ కేంద్రం నాడీ కేంద్రంగా పనిచేయనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా వెల్లడించారు.