కింగ్ చార్లెస్ తనను మానసికంగా వేధించారంటూ చార్లెస్ స్పెన్సర్ సంచలన ఆరోపణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: లండన్
బ్రిటన్ రాచరిక కుటుంబంపై దివంగత ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన కొత్త జ్ఞాపకాల పుస్తకంలో ప్రిన్సెస్ డయానా అంత్యక్రియల నాటి విషయాలను ప్రస్తావించగా, బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. కింగ్ చార్లెస్ తనను మానసికంగా వేధించారని, ఆయన వ్యాఖ్యలు పక్షపాతంతో కూడినవిగా ఉన్నాయని ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో చార్లెస్ స్పెన్సర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.