జూరాల వద్ద తీవ్ర ఉద్రిక్తత కాలువలోకి దూకిన రైతులు
రిపోర్టర్: శివ
స్థలం: మహబూబ్ నగర్ జిల్లా జూరాల
మహబూబ్ నగర్ జిల్లా జూరాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకున్న పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నిరసనలో భాగంగా రైతులు కాలువలోకి దూకి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.