నెక్కొండలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్

రిపోర్టర్: శేఖర్ స్థలం: నర్సంపేట

రాష్ట్రంలో కొత్తగా రెండు వందల జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నర్సంపేట మండలం నెక్కొండలో కోర్టు ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కోర్టు ఏర్పాటైతే నెక్కొండతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.