ముసలినాయుడుపాలెం ప్రభుత్వ బడి ఘనత: కార్పొరేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థుల ప్రతిభ
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
శృంగవరపుకోట మండలం ముసలినాయుడుపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కార్పొరేటు బడులకు దీటుగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడి సృజనాత్మక బోధనతో విద్యార్థులు గురుకుల, నవోదయ, సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అయితే గదులు సరిపోక వరండాలోనే బోధన సాగిస్తున్నామని, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని అధికారులు స్పష్టం చేశారు.