అమ్మ కోసం దూడ ఆరాటం.. కన్నీళ్లు పెట్టించే వీడియో!
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: రాష్ట్రం
ట్రక్కు వెనుక ఉన్న ఆవు బొమ్మను చూసి, అది తన తల్లి అని భ్రమపడిన ఓ దూడ పాలు కోసం పడుతున్న ఆరాటం అందరినీ కలచివేస్తోంది. ఆకలితో అలమటిస్తూ పొదుగును అందుకునేందుకు ఆ దూడ చేస్తున్న ప్రయత్నం చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
ప్రస్తుత కాలంలో వ్యాపార ధోరణి పెరిగి, దూడలకు దక్కాల్సిన పాలను కూడా పూర్తిగా పిండేయడం వల్లే ఇలాంటి దుస్థితి దాపురిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.