ప్రధాని మోదీ జన్మదినం వేళ హైదరాబాద్ లో రక్తదాన శిబిరం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కోఠిలోని వివేక్ వర్ధిని కాలేజీలో బీజేపీ తెలంగాణ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని రక్తదాతలను అభినందించారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మోదీ సేవల గురించి ఈ సందర్భంగా కొనియాడారు.