కడపలో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ కత్తితో దాడి
రిపోర్టర్: గోపి
స్థలం: కడప
కడప జిల్లా చాపాడు మండలం దువ్వూరు జగనన్న కాలనీ వద్ద ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ పోలీసులపై దాడికి దిగాడు. వాహనాల తనిఖీ సమయంలో కానిస్టేబుల్ చెన్నయ్యపై కత్తితో దాడి చేయడంతో, పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో జాకీర్ కాలికి గాయాలయ్యాయి. అతనిపై ఇప్పటికే 99 క్రిమినల్ కేసులు, నాలుగు పీడీ యాక్ట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏడు ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.