ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిబంధనలు సడలించిన తెలంగాణ ప్రభుత్వం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బేస్‌మెంట్, అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు ఎల్ 3 నుంచి ఎల్ 1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.