అఖిలేష్ యాదవ్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: గోపి స్థలం: ఉత్తర్‌ప్రదేశ్

సమాజ్వాదీ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఉత్తర్ప్రదేశ్లోని కైరానాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, పార్టీ పేరును సమాజ్వాదీ యాదవ్ పరివార్గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ముస్లింల ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి ఫ్యామిలీ పాలిటిక్స్కు మాత్రమే అఖిలేష్ యాదవ్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.