బ్లాక్ కాఫీ కాంబినేషన్లపై డాక్టర్ శుభమ్ వత్స్య కీలక రేటింగ్స్

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

బ్లాక్ కాఫీలో వివిధ పదార్ధాలను కలపడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స్య స్పష్టం చేశారు. ప్లెయిన్ బ్లాక్ కాఫీకి పదికి పది మార్కులు కేటాయించిన ఆయన, దాల్చిన చెక్కతో తొమ్మిది, పాలు కలిపితే ఎనిమిదిన్నర, నెయ్యికి ఆరు మార్కులు ఇచ్చారు. అయితే కాఫీలో చక్కెర కలపడం ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొంటూ కేవలం నాలుగు మార్కులు మాత్రమే కేటాయించినట్లు తెలిపారు.