సమాచార హక్కు చట్టం దుర్వినియోగంపై ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
సమాచార హక్కు చట్టం (RTI) దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ అత్యంత కీలకమైన ఆదేశాలను వెలువరించింది. బి.గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఏకంగా 102 ఆర్టీఐ కేసులను ఒకే బ్యాచ్‌గా స్వీకరించి కమిషన్ విచారణ పూర్తి చేసింది. ఇప్పటికే సమాచారం అందించిన తర్వాత కూడా అదే విషయంపై మళ్లీ దరఖాస్తులు దాఖలు చేయడానికి ఆర్టీఐ చట్టం అనుమతించదని, రికార్డుల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని పొందే హక్కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.