తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బియ్యం ధరలు: కిలో రూ.100 దాటుతుందా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో సన్న బియ్యం ధరలు సామాన్యులకు తీవ్ర భారంగా మారుతున్నాయని, ఇప్పటికే కిలో రూ.80 నుంచి రూ.85 వరకు పలుకుతున్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ధాన్యం లభ్యత తగ్గి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, కిలో రూ.100 నుంచి రూ.110 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ధరలు ఇంకా ఖరారు కాలేదని, సరఫరా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.