కూరగాయల సాగుపై రైతులకు శిక్షణ
మంచిర్యాల జిల్లా : తాండూరు మండలం కొత్తపల్లి రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
బెల్లంపల్లి ఉద్యాన శాఖ అధికారిణి అర్చన మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల్లో నీటి వినియోగాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించేందుకు మల్చింగ్, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. కూరగాయల సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాల కింద సబ్సిడీ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారిణి కె. సుష్మా రైతులకు ఎరువుల యాజమాన్య పద్ధతులను వివరించారు. పంట అవసరాలకు అనుగుణంగా ఎరువులను సమతుల్యంగా వినియోగించాలని సూచించారు.
కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకటేశ్, ఎంబడి శ్వేతారాణి, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేష్, మ్యాట్రిక్స్ ఎఫ్ఈ కిరణ్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.