పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతే శ్రీరామరక్ష అంటున్న రామకోటి రామరాజు

రిపోర్టర్: గోపి స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతిని ప్రతిష్టించిన కమిటీని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన విగ్రహాలకు స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 22 ఏళ్లుగా మట్టి గణపతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, దేవాలయం అధ్యక్షులు ఏమిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.